బెల్లంపల్లి, మే 10, (జనంసాక్షి )పేదలకు పట్టాల పంపిణీతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం తండావిస్తుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. గురువారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని 31 వార్డులో ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆరెస్ ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని నిరూపించిందని, ఇన్నాళ్లు పట్టాలు లేక సతమతం అయిన పేదలు ఇప్పుడు దర్జాగా జీవనం గడిపేలా చేసిన ఘనత ముఖ్యమంత్రి కెసిఆర్ దే అన్నారు. ముచ్చటగా మూడోసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేసి ఋణం తీర్చుకుందామన్నారు. ఈకార్యక్రమంలో గ్రంధాలయ చైర్మన్ రేణికుంట ప్రవీణ్, మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, కౌన్సిలర్ గెల్లి రాయలింగు, కృష్ణ, నాయకులు గడ్డం భీమా గౌడ్, సత్యనారాయణ, అన్వర్, సన్నీ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
పేదలకు పట్టాల పంపిణీతో లబ్ధిదారుల కళ్ళలో ఆనందం. – బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.




