Wednesday, 4 November 2026

పేదల ఆరోగ్యంపై పెద్దన్నలా శ్రద్ద. -బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.

 

 

 

 

 

 

బెల్లంపల్లి, ఏప్రిల్ 9, (జనంసాక్షి )పేదల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్దన్నలా శ్రద్ద తీసుకుంటున్నారని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం ఆయన బెల్లంపల్లి పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గం లోని 25 మంది లబ్ధిదారులకు పది లక్షల మూడు వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఎవరికీ తెలిసేది కాదని, కానీ ఇప్పుడు అందరికి అందుబాటులోకి తెచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కిందన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆరెస్ టౌన్ ప్రెసిడెంట్ బొడ్డు నారాయణ, కౌన్సిలర్లు నీలి కృష్ణ, కొక్కెర చంద్రశేఖర్, గొల్లపల్లి సర్పంచ్ ఇందూరి శశికళ, నాయకులు కిరణ్, సింగతి రాంచందర్, శ్రీధర్, మల్లేష్, రమేష్, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.