ఇండ్ల స్టలాల సాధనకై రాష్ట్ర వ్యాప్త ఉద్యమం……
జి. నాగయ్య సిపిఎం పార్టీ కేంద్ర కమిటి సభ్యులు…….
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం బావురావుపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 8 లో గల ఉన్న ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో నీరు పేదలు చేస్తున్న భూ పోరాట కేంద్రాన్ని శుక్రవారం రోజున జి.నాగయ్య సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, ఎస్. వీరయ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సందర్శించారు. భూ పోరాట పేదలు మహిళలు పెద్ద ఎత్తున బతుకమ్మలు, అట పాటలతో, మరియు కళాకారులు వేష ధరణాలతో ఘనంగా స్వాగతం పలికారు.ఈ సందర్బంగా భూ పోరాటానికి ముఖ్య అతిధిగా వచ్చిన జి. నాగయ్య సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ… ప్రభుత్వ అసైన్మెంట్ భూమిలో ఇండ్లు లేని, భూమి లేని నిరుపేద మహిళలు గత నెల రోజుల నుండి ఇండ్ల స్థలాలా కోసం పోరాటం చేస్తుంటే, ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు ఒక వైపు పోరాటం చేస్తున్న మహిళలను బెదిరించారు.అయిన కూడా పోరాటం ఆపలేదు.రాష్ట్రంలో ఇప్పటికే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చాలా ప్రాంతాలల్ల భూ పోరాటాలను కొనసాగిస్తున్నాం.ప్రభుత్వం హామీలమేరకు పోరాటం చేస్తున్న మహిళలకు ప్రభుత్వం అండగా నిలబడాలని ఎస్. వీరయ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు! అయన మాట్లాడుతూ… భూ పోరాట మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి. ఇండ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ,5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం 10 లక్షలు ఇవ్వాలి.ఈ రోజు పేదలు చేస్తున్న భూ పోరాటం చాలా న్యాయమైనది. రాజ్యాంగ బద్దమైనది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి, ప్రతి ఒక్కరికి ఉండటానికి ఇల్లు, ఇంట్లోకి కరెంటు, అందరికి చేయడానికి పని ప్రభుత్వాలు కల్పించాలి. కానీ ప్రభుత్వాలు ఇల్లు, పని, విద్య, వైద్యం కల్పించకపోవడంతో ఈ రోజు ప్రజలే ఆ అసైన్మెంట్ భూములను దోపిడీ దారుల, అక్రమ దారుల నుండి కాపాడుతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి భూ పోరాటం చేస్తున్న పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలి.లేకుంటే ఈ భూ పోరాటాన్ని రాష్ట్ర ఉద్యమంగా మారుస్తాము.అని అన్నారు ………పైళ్ల ఆశయ్య సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. స్థానిక జిల్లా కలెక్టర్ , స్థానిక తహసీల్దార్ మరియు ప్రజా ప్రతినిధులు అందరు స్పందించి భూ పోరాటం చేస్తున్న నీరు పేద మహిళలకు అండగా నిలబడాలి.ఈ కార్యక్రమంలో సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి, దాసరి రాజేశ్వరి, గోమాస ప్రకాష్, గోమాస అశోక్ సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు,చందు సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు, అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు, రవి కోటపల్లి మండలం సిపిఎం కార్యదర్శి, అవిజ్ సిపిఎం పట్టణ కార్యదర్శి, మరన్నా, చెంద్రన్న, దాగం శ్రీకాంత్ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు, అనిల్ జిల్లా కమిటీ సభ్యులు, అభినవ్, సత్యనారాయణ ఎస్ఎఫ్ఐ నస్ఫూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు,భూ పోరాటం కమిటీ సభ్యులు మణి, రేణుక, ఉమారాణి, ప్రసన్న,పవన సుధా, సమ్మక్క, నవీన్, సరిత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.




