Wednesday, 4 November 2026

బర్రెకుంట చెరువు పైప్‌లైన్‌ పరిశీలన

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్‌పరిధిలోని అంబేద్కర్‌నగర్‌ సమీపంలోగల బర్రెకుంట చెరువుకు అనుసందానమైన పైప్‌లైన్‌ను జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌, మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ పరిశీలించారు. గత కొద్ది సంవత్సరాల క్రితం బర్రెకుంట చెరువును బన్నె చెరువు ద్వారా నీళ్లు నింపేందుకు పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. అయితే ఆ పైప్‌లైన్‌ సక్రమంగా పనిచేయకపోవడంతో నీళ్లు తరలింపు సాధ్యం కాలేదు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఐబీ జేఈ తిరుపతితో కలిసి పరిశీలించారు. బర్రెకుంట చెరువులోకి నీళ్ల తరలింపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.పైప్‌లైన్‌కు అవసరమైన మరమ్మత్తులు చేసి బర్రెకుంట చెరువుకు సైతం జలకళ సంతరించుకునేలా ఏర్పాట్లు చేయాలని అన్నారు. మంథనిలోని అన్ని చెరువుల తరహాలోనే బర్రెకుంట చెరువు కూడా నీళ్లతో నిండి ఉండాలని ఆయన సూచించారు.