Monday, 2 November 2026

పేదల కష్టాలు తీర్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలి: గవర్నర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌27(జ‌నంసాక్షి): హైదరాబాద్‌ నగరంలోని హెచ్‌ఐసీసీలో 34వ భారతీయ ఇంజినీరింగ్‌ కాంగ్రెస్‌ సమావేశం శుక్రవారం  జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌, మంత్రి ప్రశాంత్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. పేదల బతుకులు మార్చేందుకు సాంకేతికత ఉపయోగపడాలన్నారు. కృత్రిమ మేధతో ఇంజినీర్లు తమ ప్రతిభ, పనితీరుకు పదునుపెట్టాలి. ఇంజినీరింగ్‌ కృషి దేశాభివృద్ధికి దోహదపడాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఇంజినీరింగ్‌ కృషి అభినందనీయమని గవర్నర్‌ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పాడు చేయకుండా అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉందన్నారు.