Tuesday, 3 November 2026

పేదల కొరకు ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలను అందించిన ఘనత బీఆర్ఎస్ పార్టీదే

సూర్యాపేట (జనంసాక్షి): పేదల కొరకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత బీఆర్ఎస్ పార్టీదేనని జిల్లా బీఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్ అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో 351 రోజులుగా రోగులకు వారి బంధువులకు అందిస్తున్న అల్పాహార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందుతున్నందున, రోగుల సంఖ్య పెరిగిందని, రోగులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వ ఆసుపత్రిలోనే అల్పాహారం పంపిణీ చేయటం సరైనదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి తెలపటంతో వారి సూచనల మేరకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో అల్పాహారం అందజేస్తున్నట్లు తెలిపారు. 2014కు ముందు ఆ తర్వాత జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు పట్టం కట్టాలన్నారు.బీఆర్ఎస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిందన్నారు.మంత్రి జగదీష్ రెడ్డి కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి సూర్యాపేటను అభివృద్ధి చేశారన్నారు.రానున్న ఎన్నికల్లో ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా బీఆర్ఎస్ పార్టీనే మరలా గెలిపించాలని పిలుపునిచ్చారు.గత మూడు వందల రోజులుగా ఎంతో వ్యయ ప్రయాసాలతో అల్పాహార కార్యక్రమం నిర్వహిస్తున్నమని తెలిపారు.జూలై మాసం నుండి ఒక ఏడాది పాటు తన సొంత ఖర్చులతో రోగులకు అల్పాహారం అందజేయనున్నట్లు తెలిపారు. మంత్రి జగదీష్ రెడ్డి స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి రాచకొండ శ్రీనివాస్, పైడిమరి కేశవులు, నామా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.