
వీరశైవ లింగాయత్ సమాజం ఆధ్వర్యంలో సంగారెడ్డిలో పెద్ద సభ
వీరశైవ ధర్మమే లోకహితార్ధం
శ్రీ జగద్గురు డాక్టర్చె చెన్న సిద్ధి రామ పండితారాధ్య శివాచార్య స్వాములు
సంగారెడ్డి బ్యూరో, జనం సాక్షి, జూన్ 27 : –
శ్రీ ఆది జగద్గురు పంచాచార్య యుగమన ఉత్సవము శ్రీ మహాత్మా బసవేశ్వర
జయంతోత్సవములు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని గోకుల్ కన్వెన్షన్ హాల్లో వీరశైవ లింగాయత్ సమాజం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శ్రీ శ్రీశైలం జగద్గురు పండితారాధ్య శ్రీ సిద్ధిరామ పండితా రాధ్య శివాచార్య స్వాములు ముఖ్యఅతిథిగా పాల్గొని వీరశైవ లింగాయత్ సమాజ నాయకులకు కార్యకర్తలకు ఆశీర్వాద వచన ఉపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షులు ప్రసాద్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది.
జగద్గురు ఈ సందర్భంగా ముందుగా జ్యోతి ప్రయోగాలను గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జగద్గురు మాట్లాడుతూ వీరశైవ ధర్మంలో జన్మించడమే గర్వకారణం అని, వీరశైవుడంటేనే సమాజానికి మేలు చేసేవాడని అభివర్ణించారు. వీరశైవులకు ఒక కోడ్ నెంబరు ఉందని అందరూ వీరశైవులు 8 5 6 ను తప్ప తప్పక తమ కార్యక్రమాల్లో వినియోగించాలని సూచించారు. ప్రతి ఒక్క ధర్మానికి ఒక కోడ్ నెంబరు ఉందని అలాగే వీరశైవ సమాజానికి కూడా ఒక కోడ్ నెంబరును గుర్తు చేశారు.
ప్రతి వీరశైవుడు తన ధర్మాన్ని పాటించాలని ఆయన హితువు పలికారు.
వీరశైవ ధర్మమునందు స్త్రీలకు పురుషులతోపాటు దైవార్చనది లౌకిక ఆధ్యాత్మిక సజ్జనాతికాది దైవిక అధ్యనందు సమాన హక్కులు సంక్రమించి ఉన్నవని ఉన్నవని గురువులకు వివరించారు. ఇలాంటి సమాన హక్కులను వేరే ఏ ధర్మం యందును కల్పింప లేదనివారు ఉద్బోధించారు. జగద్గురు శ్రీ రేణుకాది పంచాచార్యులు అత్యంత ప్రాచీన కాలమునందే అస్పృశ్యం ధారము గావించి ఉన్నారని, లే ఇందుకు ప్రభల సాక్షభూతములని తెలిపారు. శివగమాలు సిద్ధాంత శికోమని బసవాది శివ శరణ వచన సాహిత్యము వీరశైవ ధర్మము యొక్క ఆమూల గ్రంథము లై ఉన్నాయని ఆయన వివరించారు.
జిల్లాలోని ప్రతి మండలాలలోని గ్రామాలలోని విచ్చేసిన నాయకులకు ఆశీర్వదించారు.
అనంతరం జిల్లా అధ్యక్షుడు ప్రసాది మధు శేఖర్ మాట్లాడుతూ జిల్లా వీరశైవలింగాలందరూ ఒక తాటిపై వచ్చి తమకు సహకరించడం చాలా సంతోషకరంగా ఉందన్నారు. మున్ముందు ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరింత నిర్వహించడం జరుగుతుం దన్నారం. సంగారెడ్డి జిల్లా కర్ణాటక సరిహద్దులో ఉండుట వలన వీరశైవ సాంప్రదాయానికి నిలయంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణలో వీరశైవులు అధిక జనాభా కలిగి జిల్లాగా సంగారెడ్డి జిల్లా అన్నారు.ఈ జిల్లాలో పలుచోట్ల పలు మఠాలు వెలిసి ఉన్నాయని ఈ ఆధ్యాత్మి కార్యక్రమాలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా వీరశైవ సమాజంలో మంచి సేవలందించిన పలువురిని సత్కరించారు.
అంతకుముందు పీఠాధిపతులకు నాట్య, నృత్య ప్రదర్శనతో విద్యార్థులు ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో దత్తగిరి మహారాజ్ పీఠాధిపతులు అవధూతగిరి మహారాజ్, బీచ్కుంద పీఠాధిపతిశ్రీ సోమాయప్ప శివాచార్యులు, తంగేడి పల్లి పీఠాధిపతులు శివయోగి శివాచార్యులు, రాజయ్య స్వామి, రాష్ట్ర వీరశైవ లింగాయత్ మన మహిళా అధ్యక్షురాలు రుద్రమదేవి, ధనాసరి పీఠాధిపతి వీరేశ్వర శివాచార్యులు, వీరశైవ లింగ జిల్లా అధ్యక్షులు ప్రసాది మధు శేఖర్, శివచంద్ర పాటిల్ప్ర, కౌలాస్ మంజుల, రవికుమార్ కార్యదర్శి ఏ జయ ప్రకాష్, గౌరవాధ్యక్షుడు శివచంద్ర కుమార్ పాటిల్, జిల్లాలోని వివిధ మండలాలకు వివిధ గ్రామాలకు సంబంధించిన కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




