సోమవారం హైదరాబాద్‌లోని ఓయూ ఆర్ట్స్ కళాశాల న్యూ సెమినార్‌హాల్‌లో ఆలిండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్ (ఏఐపీఎస్‌ఎన్) జనవిజ్ఞాన వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘సబ్‌కాదేశ్-హమారాదేశ్’ జాతీయ క్యాంపెయినింగ్ ప్రారంభోత్సవంలో మాట్లాడుతూ… రాష్ట్రంలో పాలకపక్షాలు తమ సెంటిమెంట్స్ కోసం ప్రజాధనం వృథా చేస్తున్నాయని జస్టిస్(రిటైర్డ్) చంద్రకుమార్ అన్నారు. అనంతరం ‘డెమోక్రసీ-డైవర్సిటీ డెవలప్‌మెంట్ సోషల్ జస్టిస్’ అంశంపై ఆయన మాట్లాడుతూ..
మనదేశం అనేక మతాల, కులాల సమ్మేళనమని, ఒకరి పండుగల్ని మరొకరు నిర్వహించుకుంటూ ఐక్యతను చాటుతున్న గొప్ప సెక్యులర్, డెమోక్రటిక్ విలువల గల దేశమని చెప్పారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు రిజర్వేన్లనీ, డబుల్ బెడ్‌రూం ఇండ్లని గొప్పగొప్ప హామీలిచ్చిన పాలకులు అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. అంకెల గారడీతో అభివృద్ధి కాదని, ప్రజల జీవన ప్రమాణాలు పెంచుడే అభివృద్ధని చెప్పారు. ఐక్యరాజ్య సమితి సూచనల ప్రకారం అభివృద్ధి, అధికారం అన్నివర్గాలకు అందాలని, ఇది సర్వజనుల హక్కని అన్నారు. అమర్త్యసేన్ అన్నట్టు విద్య, వైద్యంపై ప్రజలకు హక్కులు కల్పించాలని సూచించారు. సరళీకరణ అనంతరం వనరులు కొన్నివర్గాలకే చెందుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో సంపన్నుల సంపద రెట్టింపవుతుండగా.. పేదవారు మరింత పేదరికంలో మగ్గుతున్నట్టు తెలిపారు. పదవులు, కాంట్రాక్టుల కోసం బట్టలు వదిలేసినంత తేలికగా నాయకులు పార్టీలు మారడం హాస్యాస్పదమన్నారు.
పేదవారు మరింత పేదవారు అవుతున్నారు..




