Thursday, 5 November 2026

పేద గిరిజనుడు గుండెపోటుతో హఠాత్మరణం

పేద గిరిజనుడు గుండెపోటుతో హఠాత్మరణం.
నెరడిగొండనవంబర్14(జనంసాక్షి):మండలంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన పెందుర్ సీతారాం(65) సోమవారం రోజున మండల కేంద్రంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయిన ఘటన చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పెందుర్ సీతారాం ఆయన మనమడి ఆరోగ్యం బాగులేకపోవడం వలన చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోని ఓ ఆస్పత్రిలో చూయించిన తదనంతరం స్వల్ప సమయంలో మండల కేంద్రంలోనే అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఏమిచేయలేని పరిస్థితిలో మృతి చెందారని.వారి కుటుంబ బతుకు బండి కోనసాగించుటకు దాదాపు 20 సంవత్సరాల పాటు జీతం ఉండి కుటుంబాన్ని పోషించిన ఘనత వారికి దక్కినట్లు ఉందని పేర్కొంటూ మృతుడికి ఓ భార్య ఇద్దరు కుమారులు మరో ఇద్దరి కుమార్తెల పెళ్లిళ్ల కోసం అప్పు సోప్పులు చేసి పెళ్లిళ్లు చేశారు.ఆర్థిక ఒత్తిడికి గురైనట్లు ఇట్టి ఆకస్మిక మరణం వార్త విన్న బంధువులు కంటతడి పెట్టారు.గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.పేద రైతు కుటుంబాని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.