నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలి
ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ ఎల్ మూర్తి
రంగారెడ్డి,ఇబ్రహీంపట్నం, (జనంసాక్షి): ఎస్ఎఫ్ఐ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ ఆల్ ఇండియా మహాసభల సందర్భంగా నూతన జాతీయ విద్యా విధానం (ఎన్ఈపి)పై సోమవారం ఆశ్రిత డిగ్రీ కళాశాలలో సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎల్. మూర్తి హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం విద్యారంగంలో అసమానతలు పెంచుతుందని ఈ విద్యా విధానం అమలయితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యను దూరం చేయడమేనని మండిపడ్డారు. విద్య వ్యవస్థని పూర్తిగా కార్పొరేట్లకు కట్టబెట్టి పేదవారికి విద్య అందని ద్రాక్షగా మారుతుందని ఈ నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసహరించుకోవాలని కోరారు. ఎస్ఎఫ్ఐ 17వ ఆల్ ఇండియా మహాసభలు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో 13 నుంచి 16 వరకు జరుగుతున్నాయని అన్నారు. ఈ మహాసభలకు దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థి ప్రతినిధులు, మేధావులు హాజరవుతున్నారని కోరారు. ఈ మహాసభలలో దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమ నిర్మాణం కోసం కార్యచరణ రూపొందిస్తారని అన్నారు. ఈ మహాసభలను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.




