Tuesday, 3 November 2026

పేద ప్రజలపై పెను భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వం… రైతుబంధు జిల్లా అధ్యక్షులు. ఇర్రి

బచ్చన్నపేట మార్చ్ 3 (జనం సాక్షి) దేశంలోని పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ధర పెంచి పెను భారం మోపుతుందని రైతుబంధు జిల్లా అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి అన్నారు.శుక్రవారం బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బోడిగం చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆదేశాల మేరకు బచ్చన్నపేట మండల కేంద్రంలో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనగామ జిల్లా రైతుబంధు అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి . జడ్పీ వైస్ చైర్మన్ గిరబోయిన భాగ్యలక్ష్మి ఎంపీపీ బి నాగజ్యోతి ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు దూడల కనకయ్య. సహకార సంఘం చైర్మన్ పులిగిల్ల పూర్ణచందర్ లు మాట్లాడుతూ .
2014 సంవత్సరంలో 410 రూపాయలు ఉన్న గ్యాస్ ధర ఈ రోజు 1150 రూపాయలు పెంచిడం జరిగిందని, పెట్రోల్, డిజిల్,ధరలు నిత్యవసర సరుకులు ధరలు పెంచి పేదవాడి నడ్డి విరిగేలా చేసిన మోడీ ప్రభుత్వంన్ని గద్దె దింపాలన్నారు.
పేదలకు అండగా ఉంటున్న బిఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారని కళ్యాణ లక్ష్మి, రైతు భీమా, రైతు బంధు, అసరా పింఛన్లు, అనేక పథకాలు పేద ప్రజలకు అందిస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కల్లూరి అనిల్ రెడ్డి. స్థానిక సర్పంచి వడ్డేపల్లి మల్లారెడ్డి. సర్పంచులు కోనేటి స్వామి. ముసిని సునీత రాజు గౌడ్. పర్వతం మధు ప్రసాదు. వేముల వెంకటేష్. నూకల నర్సిరెడ్డి. గౌడ్. కోఆప్షన్ సభ్యులు ఎండి షబ్బీర్. ఎంపీటీసీ కరుణాల వేణు. మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి. నాయకులు కొండి వెంకటరెడ్డి. గిరబోయిన అంజయ్య. బి కృష్ణంరాజు.వార్డ్ మెంబర్లు చెంధ్యాల ఉపేందర్. కక్కెర్ల రాజు. కామెడీ శ్రీనివాస్ రెడ్డి. సోషల్ మీడియా కన్వీనర్ పడిగల కరుణాకర్ రెడ్డి. మీసా శ్రీనివాస్. చిక్కుడు రవి. కాపర్తి హరిప్రసాద్. బొమ్మెన ఆంజనేయులు గౌడ్. మేకల రాజు. వేముల లక్ష్మణ్ గౌడ్. దాసారం శ్రీనివాసు. మోకు నర్సిరెడ్డి. బచ్చన్నపేట మండల మహిళా అధ్యక్షురాలు మద్దికుంట రాధా. గూడ సిద్ధారెడ్డి. వడ్డేపల్లి ఉపేందర్ రెడ్డి. గంధ మల్ల నరేందర్. ఫెరోజ్. సిద్ధిరామిరెడ్డి. జూకంటి కిష్టయ్య. కైసర్. జగన్. జిల్లా సందీప్. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు