Thursday, 5 November 2026

పేద ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకునే ఆపద్బాంధవుడు ఎంపీ శ్రీ కోమటిరెడ్డి

వెంకటరెడ్డి…పేద ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకునే ఆపద్బాంధవుడు ఎంపీ శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి…ఎంపీ,  1 లక్ష రూపాయల ఎల్ఓసి పత్రాన్ని అందిస్తున్న మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్…
భువనగిరి టౌన్ (జనం సాక్షి):–భువనగిరి పట్టణ 23వ వార్డులో కడారి గోపాల్ యాదవ్ బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యుల ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో హైదరాబాద్ నిమ్స్ హాస్పటల్ లో వైద్య ఖర్చుల నిమిత్తం భువనగిరి పార్లమెంట్ సభ్యుడు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో ప్రభుత్వంపరంగా 1 లక్ష రూపాయలు (ఎల్ఓసి) పత్రాన్ని స్థానిక కౌన్సిలర్  పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్ గార్లు కుటుంబ సభ్యులకు అందజేసి మాట్లాడుతూ పేద ప్రజలు  ప్రమాదవశాత్తు గాని అనారోగ్యానికి గురైతే వాళ్ల ఆర్థిక పరిస్థితులు సరిగ్గా లేకపోతే స్థానిక ఎంపీ, శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తన సొంత నిధుల నుండి గాని ప్రభుత్వపరంగా గాని ఆపదలో ఉన్న వాళ్లను ఆదుకుంటున్న ఆపద్బాంధవుడు అని అధికారంలో ఉన్న లేకపోయినా ప్రజలకు ఎలాంటి అవసరాలు వచ్చినా నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల కష్టాలు తీరుస్తున్న గొప్ప మహోన్న వ్యక్తి వెంకటరెడ్డి గారిని రానున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకంలో మెరుగైన వైద్యం చేయించుకోవడం కోసం ఎంత ఖర్చైనా ప్రభుత్వ పరంగా వైద్యం చేయించుట కొరకు సదుపాయాలు కల్పిస్తామని పేద ప్రజలు అధర్య పడొద్దు కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలని అన్నారు ఈకార్యక్రమంలో కడారి మధు అనిల్ కడరి పద్మ సువర్ణ శ్యామల లక్ష్మి పోకల మౌనిక మధుబాబు ప్రభాకర్ సాయి నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.