నర్సి0హుల పేట ఏప్రిల్ 25 (జనం సాక్షి)పేద ప్రజల జీవితాలలో వెలుగులు నింపడమే బిఆర్ఎస్ పార్టీ లక్ష్యం అని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మైదం దేవేందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ మండలంలోని పలు గ్రామాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ పేదవాని పెన్నిధిగా నిలుస్తున్నారని ఆయన తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన పథకాలకు ఆకర్షితులై వివిధ రాష్ట్రాలకు చెందిన నేతలు బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుర్చుకుంటున్నారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వేముల రజిత రామ్ రెడ్డి,ఎంపీపీ టేకుల సుశీల యాదగిరిరెడ్డి,రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్ తోట సురేష్,వైస్ ఎంపీపీ దేవేందర్,సలుగు వెంకటేశ్వర్లు,సర్పంచుల ఫోరం అధ్యక్షులు మేరుగు శంకర్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షులు బత్తిని జగదీశ్వర్, రామన్న,పృద్వి, రాంబాబుతదితరులు పాల్గొన్నారు.





