నర్సి0హుల పేట ఏప్రిల్ 25 (జనం సాక్షి)ప్రతి ఒక్కరూ బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని కొమ్ములవంచ బిఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు డోనికని రామన్న కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మంగళవారం పార్టీకి చెందిన జెండాను ఎగుర వేసిన తర్వాత ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక జనాకర్షక పథకాలను ప్రవేశపెట్టి పేదవాని కలలను సహకారం చేస్తున్నదని ఆయన కొనియాడారు. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ నియోజకవర్గ వ్యాప్తంగా పలు గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతూ ప్రత్యర్థి పార్టీలకు ముచ్చమటలు పట్టిస్తున్నాడని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దాస రోజు వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ దేవేందర్,జిల్లా రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ తోట సురేష్,ఉప సర్పంచ్ లక్ష్మీనారాయణ, బిఆర్ఎస్ పార్టీ నాయకులు సలుగు, వెంకటేశ్వర్లు ,నరసయ్య బూరుగడ్ల రవి,పృద్వి, రాంబాబు,దొంతు నరసయ్య,పార్నంది వెంకన్న,జేరిపోతుల రవి తదితరులు పాల్గొన్నారు.





