Wednesday, 4 November 2026

పేద రైతులకు భూముల పంపిణీ

కరీంనగర్‌, నవంబర్‌ 6  బడుగు, బలహీన వర్గాల రైతుల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ భూములను వారికి అందిస్తున్నదని మంత్రి శ్రీధరబాబు అన్నారు. మంథెన మండలంలో మంగళవారంనాడు ఆయన ప్రభుత్వ భూములను రైతులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల రైతులను అభివృద్ధిలోకి తీసుకువచ్చేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని అన్నారు. ప్రభుత్వ భూముల్లో పంటలు పండించి అభివృద్ధిలోకి తేవాలని ఆయన కోరారు. ఆ దిశగానే వారికి ప్రభుత్వ భూములు పంపిణీ చేయడం జరుగుతున్నదని అన్నారు. స్వశక్తి మహిళా గ్రూపులకు పావలావడ్డీ రుణాలు అందిస్తున్నదని, వాటిని సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థికంగా ఎదిగాలని ఆయన అన్నారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో ముందుండేందుకు ప్రభుత్వం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నదని మంత్రి తెలిపారు. మంథెని, మహదేవ్‌పూర్‌ ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చేపడుతున్నదని అన్నారు. మంత్రి వెంట పర్యటనలో కలెక్టర్‌ స్మితా సబర్వాల్‌, ఆర్డీఓలు, తహశీల్దార్‌ శ్రీనివాసరెడ్డి,  రెవెన్యూ, పంచాయితీ, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *