పేద విద్యార్థిని పెద్ద చదువుకు మంత్రి కేటీఆర్ భరోసా..                                                 

– డాక్టర్ చదువు కు అండగా ఉంటామని ట్విట్టర్ వేదికగా ప్రకటన

– కేటీఆర్ కార్యాలయం నుంచి ఫోన్ నేడు ఉదయం ఏడు గంటలకు ప్రగతి భవన్ కు రావాలని పిలుపు                                                              మంథని, ఫిబ్రవరి 13, ( జనం సాక్షి ):  పెద్ద చదువులకు పేదరికం అడ్డంకి మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు వేల ర్యాంకు సాధించిన నిరుపేద విద్యార్థులు అఖిల దాతల సహాయం కోసం ఆశగా ఎదురు చూపు అనే శీర్షికతో జనంసాక్షి లో ఆదివారం ప్రచురితమైన కథనానికి రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. అఖిల డాక్టర్ చదువు పూర్తయ్యే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు కేటీఆర్ ఆఫీస్ నుంచి సిబ్బంది అఖిల కు ఫోన్ చేసి ఇఆమె కుటుంబ ఆర్థిక స్థితిగతులు డాక్టర్ విద్య పూర్తి అయ్యే వరకు ఖర్చు ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. సోమవారం ఉదయం ఏడు గంటలకు హైదరాబాదులోని ప్రగతి భవన్ కు రావాలని అఖిల కు  కేటీఆర్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. వైద్య విద్య అభ్యసించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పేద ప్రజలకు సేవ చేద్దామని ఎంతో ఆకాంక్ష ఉన్నా కానీ ఆర్థిక ఇబ్బందుల వల్ల చదువు కొనలేక అయోమయం లో ఉన్న మెడికల్ స్టేట్ లెవెల్ లో నాలుగు వేల ర్యాంకు సాధించి రంగారెడ్డి జిల్లాలోని సూరారం మల్లారెడ్డి మెడికల్ కళాశాలలో సీటు సొంతం చేసుకున్నా.. పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్ పూర్ మండలం గుండారం గ్రామం పంచాయతీ పరిధిలోని రాజాపూర్ అనే గ్రామానికి చెందిన అవునురా అఖిల దీన గాథను జనంసాక్షి వెలుగులోకి లోకి తీసుకు రావడం జరిగింది. పేద కుటుంబంలో పుట్టిన తాను చదువు కొనే స్తోమత లేని విషయం తెలుసుకొని తన వద్దకు వచ్చి వివరాలు తెలుసుకుని వార్త గా ప్రచురించిన జనం సాక్షి పత్రిక కు స్పందించిన మంత్రి కేటీఆర్ కు అఖిల, వారి కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.