Tuesday, 3 November 2026

పేద విద్యార్థులను ఆదుకోవాలి : జస్టిస్‌ చలమేశ్వర్‌

హైదరాబాద్‌ : విద్యార్థులు ఉన్నత స్థానానికి ఎదిగాక పేద విద్యార్థుల్ని ఆదుకునే ప్రయత్నం చేయాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిన్‌ చలమేశ్వర్‌ సూచించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిన్‌ పీసీ రెడ్డి ట్రస్టు పదమూడో వార్షిక అవార్డుల ప్రధాన కార్యక్రమం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగింది. ఈ సందర్భంగా న్యాయశాస్రం, మెడిసిన్‌ , ఇంజినిరింగ్‌, క్రీడలు . సాంస్కృతిక విభాగాల్లో రాణిస్తున్న విద్యార్థినులకు జస్టిన్‌ చలమేశ్వర్‌,
లోకాయుక్త జిస్టిన్‌ సుభాషణ్‌ రెడ్డి చేతుల మీదుగా పీసీ రెడ్డి అవార్డుల్ని ప్రధానం చేశారు. ప్రభుత్వాలు అందరిని ఆదుకోలేవని, అందుకే ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో ఆలోచించాలని జస్టిన్‌ చలమేశ్వర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *