పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి

సూర్యాపేట ప్రతినిధి(జనంసాక్షి): అనాధ పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి కృషి చేస్తానని హెడ్ కానిస్టేబుల్ పాలవెల్లి రమేష్ కుమార్ అన్నారు.శుక్రవారం జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలు, అనాధాశ్రమాలలో చదువుతున్న విద్యార్థులకు తన సొంత ఖర్చులతో నోటు పుస్తకాలు, పెన్నులు, స్కూల్ బ్యాగ్, షూలు, డిక్షనరీలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008 నుండి నేటి వరకు జిల్లా కేంద్రంలోని పేద విద్యార్థులకు విద్యా సామాగ్రి పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. పేద విద్యార్థుల విద్యాభివృద్ధికి తన సొంత ఖర్చులతో మరిన్ని సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు, అనాధ ఆశ్రమాల నిర్వాహకులు, శ్రీనివాస్, రమేష్, మదిన చారి, వనజ, ఎస్సై జహంగీర్, సిబ్బంది శ్రీకాంత్, ఆరిఫ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు