Thursday, 5 November 2026

పేపర్ లీకేజీని నిరసిస్తూ కమాన్ పూర్ బిజెపి నిరసన

 జనంసాక్షి ,కమాన్ పూర్ : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు చందుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు సోమవారం కమాన్ పూర్ మండల కేంద్రంలో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి మండల పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల నాయకులు మాట్లాడుతూ… టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బాధ్యులైన వారిని బర్తరప్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలను అన్ని విషయాల్లో గోస పెడుతుందని త్వరలోనే బిజెపి ప్రభుత్వం వస్తుంది అన్ని వర్గాల ప్రజలకు మంచి జరుగుతుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు జంగపల్లి అజయ్, బిజెపి సీనియర్ నాయకులు మచ్చ గిరి రాము, మండల ప్రధాన కార్యదర్శులు మల్లారపు అరుణ్ కుమార్, బర్ల సదానందం, మహిళా మోర్చా అధ్యక్షురాలు కృష్ణవేణి, యువ మోర్చా అధ్యక్షులు పంతకాని విశ్వతేజ బిజెపి నాయకులు మట్ట మల్లేష్, దండే రమేష్, కొయ్యడ సతీష్, మట్ట రాజయ్య, చిప్ప కుర్తి సతీష్, జంగపల్లి శేఖర్ జంగ పల్లి శ్రీనివాస్, ఇరుగురాల భాను ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.