గౌడ్ జనంసాక్షి , కమాన్ పూర్ : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పేరపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నూతన గ్రామ శాఖ కమిటీని శుక్రవారం కమాన్ పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వైనాల రాజు ఆధ్వర్యంలో ఎన్నుకోవడం జరిగింది. పేరపల్లి గ్రామ శాఖ గౌరవ అధ్యక్షునిగా జంగపెళ్లి ఎర్రయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడిగా బొంగోని సదయ్య గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షునిగా ఉపాధ్యక్షులుగా పోలుదాసరి మధునయ్య, ప్రధాన కార్యదర్శిగా ఎరుకల శ్రీహరి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా జంగలి శంకర్ , సెక్రటరీగా మహంకాళి రాయమల్లు, కార్యదర్శిగా ఎరుకల నరసయ్య ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు వైనాల రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ తొగరి అన్నపూర్ణ అశోక్అశోక్, జిల్లా నాయకులు గాండ్ల మోహన్, మాజీ కో ఆప్షన్ అబ్దుల్ రఫిక్, మాజీ సర్పంచ్ దాసరి గట్టయ్య, కాంగ్రెస్ పెంచికల్పేట్ గ్రామ శాఖ అధ్యక్షులు ఇరుగురాల శేఖర్, నాయకులు భూసా తిరుపతి, బొజ్జ సతీష్, మామిడి రాజు, పెద్ద సంఖ్యలో పేరపల్లి గ్రామ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పేరపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా సదయ్య




