Thursday, 5 November 2026

చెస్ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేయండి

జనం సాక్షి రెబ్బాన: చెస్ రాష్ట్ర స్థాయి పోటీలను విజయవంతం చేయాలని కొమురం భీం జిల్లా చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కోట సుధాకర్ తెలిపారు,ఈరోజు గోలేటిలోని CER క్లబ్ లో మాట్లాడారు, సింగరేణి స్కూల్లో రేపు అనగా 9,10,11లలో ఓపెన్ చెస్ రాష్ట్ర స్థాయి పోటీలు ఉంటాయని అన్నారు,ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి IK రెడ్డి గారు,ప్రభుత్వ విప్ బాల్క సుమన్,జడ్పీ చైర్మన్ కోవ లక్మి గారు,ఎమ్మెల్యే ఆత్రం సక్కు,కోనేరు కొనప్ప గారు హాజరౌతారని అన్నారు రాష్టంలోని 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు,ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాలరాజ్ శ్రీనివాసరావు, జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్, కోశాధికారి కుమ్మరి మల్లేష్, జాయింట్ సెక్రటరీ కేసరి ఆంజనేయులు గౌడ్,ఎం.రవీందర్ తోపాటు తదితరులు ఉన్నారు*