హైదరాబాద్: జీవ వైవిధ్య సదస్సుకు చిహ్నంగా హైదరాబాద్ శివారు రాయదుర్గంలో నిర్మిస్తున్న పైలాన్ పనులను సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇవాళ పరిశీలించారు. ఈ నెల 16న ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ చేతుల మీదుగా ప్రారంభం కానున్న పైలాన్ పని తుది రూపు దిద్దుకుంటొంది. ప్రాంగణంలో మొక్కలు నాటడం, ఫ్లోరింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. సుమారు గంటసేపు ఈ పనులను పరిశీలించి ప్రధాని రాక సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై తెలుసుకున్నారు.




