Thursday, 5 November 2026

పొంగులేటి, కోరం ఆత్మీయ సమ్మేళనానికి కదిలిన అభిమానులు

 

టేకులపల్లి, జనవరి 23( జనం సాక్షి ):ఇల్లందులో సోమవారం నిర్వహించిన పొంగులేటి, కోరం ఆత్మీయ సమ్మేళనానికి వారి అభిమానులు టేకులపల్లి మండలం నుండి భారీగా తరలి వెళ్లారు. బిఆర్ఎస్ పార్టీని వీడతారని జరుగుతున్న ప్రచారంలో భాగంగా తమ వర్గం చేజారకుండా వారి వెంటే ఉండటానికి పగడ్బందీగా చేసుకుంటున్న ఏర్పాట్లలో ఆత్మీయ సమ్మేళనాలతో నియోజకవర్గ స్థాయిలలో వారి బలనిరూపణ నిరూపించుకునేందుకు జనాన్ని భారీగా సమీకరిస్తున్నారు. అందులో భాగంగా ఇల్లందు నియోజకవర్గంలోని ఇతర మండలాలతోపాటు టేకులపల్లి మండలం నుండి కూడా పొంగులేటి, కోరం అభిమానులు భారీగా తరలించారు.