ఇంద్రవెల్లి జనవరి 23( జనం సాక్షి)
ఇంద్రవెల్లి : ఆదివాసుల ఆరాధ్య దైవం మండలంలోని కేస్లాపూర్ గ్రామంలో కొలువు దీరిన నాగోబాను టిఎన్జీఓ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు అజ్మీరా శ్యాం నాయక్ సోమవారం దర్శించుకున్నారు.ఆలయంలో నాగోబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయనను మెస్రం వంశీయులు శాలువాతో సత్కరించి, నాగోబా చిత్రపటాన్ని బహుకరించారు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ చైర్మన్ డోంగ్రే మారుతి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు మహ్మద్ అంజధ్,ఎంపీటీసీ కోవ రాజేశ్వర్,మాజీ ఎంపీటీసీ కనక హనుమంతు, ఏమైకుంట సర్పంచ్ జాదవ్ లఖన్, మాజీ సర్పంచ్ కోరెంగ సుంకటరావు,మెస్రం నాగనాథ్, బీఅర్ఎస్ మండల కో ఆర్డినేటర్ షేక్ సూఫీయాన్,మాజీ ఎంపీపీ కనక తుకారాం,బాబు ముండే,తదితరులు పాల్గొన్నారు.
నాగోభాను దర్శించుకున్న టిఎన్జీఓ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు…




