కొంపెల్లిలో బుధవారం జరిగిన క్షత్రియుల అర్ధశతాబ్ధి ప్రస్థాన సమ్మేళనాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగించారు. ‘తెలంగాణ ఉద్యమం ప్రారంభించినప్పుడే జల దృశ్యంలోనే నా వైఖరి స్పష్టంగా చెప్పాను. పొట్టకూటి కోసం వచ్చే వారితో పేచీ లేదు, పొట్టకొట్టే వారితోనే పంచాయతీ అని చెప్పాః మేము అదే మాటకు కట్టుబడి ఉన్నాం. మేం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత కూడా అదే విధానాన్ని కొనసాగిస్తున్నాం’ అని సిఎం కె చంద్రశేఖర్‌రావు అన్నారు. ఏ ప్రాంతం నుంచి వచ్చి స్థిరపడిన వారినైనా అక్కున చేర్చుకుని ఆదరించే సంస్కృతి హైదరాబాద్ సొంతమని, ఆ సంప్రదాయం మరింత గొప్పగా కొనసాగుతుందన్నారు.క్షత్రియులకు ప్రభుత్వం పూర్తిస్తాయి అండగా నిలబడుతుందన్నారు. అనేక ప్రాంతాల నుంచి వచ్చిన వారందరూ హైదరాబాద్ నగర అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యారన్నారు.
పొట్టకొట్టే వారితోనే పంచాయతీ




