Friday, 6 November 2026

పొట్టను చీల్చి గర్భస్థ శిశువు తస్కరణ

Pregnant Woman

న్యూయార్క్: గర్భవతి అయిన మహిళను పొడిచి, గర్భంలోని శిశువును ఎత్తుకెళ్ళిన సంఘటన కొలరాడోలో జరిగింది. బట్టలు అమ్ముతానని చెప్పి ఇంట్లోకి వచ్చిన దుండగుడు గర్భవతిని దారుణంగా పొడిచి గర్భాన్ని చీల్చి శిశువును తీసుకొని పారిపోయాడు. ఆన్‌లైన్‌లో ఓ అపరిచిత వ్యక్తి క్రెయిగ్‌లిస్టు యాడ్‌కు స్పందించిన సదరు మహిళ తనకు పుట్టబోయే బిడ్డకు ఎటువంటి బట్టలు నప్పుతాయని అడిగే సమయంలోనే ఒక్కసారిగా ఆమెపై బడి విచక్షణారహితంగా పొట్టలో పొడిచాడు.

సమాచారం అందుకుని ఆమె ఇంటికి చేరుకున్న పోలీసులకు సంఘటన స్థలంలో రక్తపు మడుగులో కడుపులో తీవ్ర గాయాలతో పడి ఉంది. ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆమె కోలుకుంటుందని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. అయితే అదే సమయంలో మృత శిశువుతో ఆసుపత్రిలో తచ్చాడుతున్న ఓ 34 ఏళ్ళ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ఈ అనుమానస్పద వ్యక్తికి, బాధిత మహిళకు ఇంతకుముందు పరిచయం లేదని పోలీసులు పేర్కొన్నారు. ఇరువురి మహిళల వివరాలు గోప్యంగా ఉంచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *