హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీతో పాటు ఇతర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. సమావేశం ద్వారా సీఎం రాష్ట్రంలో విద్యుత్ పరిస్థితిపై సమీక్ష చేపట్టారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను అదిగమించేందుకు, ఇతర రాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోలుకు సీఎం రూ. 350 కోట్లను విడుదల చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలను ఎదుర్కొనేందుకు చర్యలను తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులకు నాణ్యమైన విద్యుత్‌ను అందించాలని ఆదేశం. కేరళలోని కాయకుళం విద్యుత్ ప్రాజెక్ట్ సహా ఇతర ప్రాంతాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని సీఎం అధికారులకు సూచించారు.