హైదరాబాద్ : కులమతాలకు అతీతంగా తెలుగు మాట్లాడే వారందరి కోసం పొట్టి శ్రీరాములు త్యాగం చేశారని మంత్రి టీజీ వెంకటేశ్ కొనియాడారు. సచివాలయం వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి మంత్రి పూలమాల వేసి నివాళులర్పించారు.తెలుగు ప్రజల కోసం పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. అయన జన్మదినాన్ని తెలుగు వారందరూ పండుగలా జరుపుకోవాలని సూచించారు.




