మోత్కూరు జూన్ 1 జనంసాక్షి :శ్రీ కనకదుర్గ దేవాలయ పునః నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం మోత్కూరు మండలంలోని పొడిచేడు లో గురువారం హోమం, నవధాన్యాల పూజ కార్యక్రమాలు స్థానిక సర్పంచ్ పేలపూడి మధు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్, బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణ రెడ్డి హాజరయ్యారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ పేలపూడి మధు – స్రవంతి దంపతులు కలిసి శాస్త్రోక్తంగా పున నిర్మాణ కార్యక్రమాల పూజ తంతును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మోత్కూరు జెడ్పీటీసీ గొరుపల్లి శారద సంతోష్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ కోనతం యాకూబ్ రెడ్డి, బిఆర్ఎస్ నాయకులు కాసోజు శంకరమ్మ, మదర్ డైరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మి నరసింహ రెడ్డి,బిఆర్ఎస్ నాయకులు పేలపూడి సత్యనారాయణ,సింగిల్ విండో వైస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కప్పే వెంకన్న, వార్డు సభ్యులు దెందె యాదగిరి, మల్లం లక్ష్మి రమేష్,బండ వనజ లింగయ్య,బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు బోయపల్లి సైదులు, దీటీ బాల నర్సయ్య, బాల పెద్దులు,ఆరాధ్య ఫౌండేషన్ గ్రామ అధ్యక్షుడు నర్రె సురేష్,షణ్ముఖ చారి,వెంకటేష్,అనిల్,సైదులు,నరసింహ, గ్రామ ప్రజా ప్రతినిధులు,నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.




