కంటోన్మెంట్ జనం సాక్షి : మోంట్రా ఎలక్ట్రిక్ షోరూమ్ ను బోయినపల్లిలోని గ్రీమాబ్ ఆటోమోటివ్స్ ను తెలంగాణ కార్మిక మరియు ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లా రెడ్డి చేతుల మీదగా ప్రారంభించారు. టీఐ క్లీన్ మొబిలిటీ సీఈఓ సుశాంత్ జెనా మరియు పార్టనర్లు కాంత్ వెల్లూరు,తేజ పవన్ కుమార్, కిరణ్ కుమార్ గంజి, ఎం.విద్యాధర్,పాత లక్ష్మణ్ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో, మురుగప్ప గ్రూప్ వారసత్వం నుండి ఎలక్ట్రిక్ త్రీవీలర్,హైదరాబాద్, తెలంగాణ మార్కెట్లను తాకింది.ఏ ఇతర ఆటో కంటే కూడా అత్యంత విభిన్నమైన ఆకర్షణీయ డిజైన్‌లో, పరిశ్రమలోనే అత్యధిక సర్టిఫైడ్ పరిధి ఒక్క సింగల్ ఛార్జి నే 197 కి.మీ.(విలక్షణ వరిధి 160 కి.మీ.) మరియు శక్తివంతమైన మోటారుతో సూపర్ ఆటో ఇప్పటికీ పరిశ్రమలో సంచలనాలను సృష్టించింది.సికింద్రాబాద్ గ్రీనాబ్ ఆటోమోటివ్స్, 71, సౌజన్య కాలనీ, హెర్పి పెట్రోల్ పంప్ ఎదురుగా, న్యూ బోయినపల్లి లో డీలర్లను కస్టమర్లునేరుగాసందర్శించవచ్చు లేదా కంపెనీ వెబ్సైట్లో టెస్ట్ రైడ్ బుక్ చేసు కోవచ్చు.తెలంగాణ రాష్ట్రం చాలా కీలకమైనఎలక్ట్రిక్ రవాణాను చురుకుగా ప్రోత్సహిస్తున్నది.మోంట్రాఎలక్ట్రిక్ సూపర్ ఆరో 60 ఎన్ఎమ్ యొక్క ఇండస్ట్రీ బెస్ట్ టార్క్,55 ఎమ్పీహెచ్ గరిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. వాహనాన్ని మరింత మెరుగ్గా నడవడం కోసం పార్క్ అసిస్ట్ మోర్తో పాటు తక్కువ ఖర్చు కోసం మల్టీ డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంది.ఈ వాహనం 3 సంవత్సరాలు లో 1లక్ష కిమీ వారంటీతో పాటు,కంపెనీ 24×7 రోడ్‌సైడ్ అసిస్టెన్స్, 2 సంవత్సరాలు పొడిగించిన వారంటీ ఎంపిక మరియు 3 సంవత్సరాల వార్షిక నిర్వహణ అన్నను కూడా అందిస్తున్నది.బేష్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 3,02 లక్షలు (ఎక్స్-షోరూమ్ పోస్ట్-నబ్సిడీ) లో మరియు పెద్ద బ్యాటరీతో అధిక రేంజ్ వేరియంట్ రూ.2.45 లక్షల ధరతో అందుబాటులో ఉంది. కస్టమర్‌కు ఫైనాన్సింగ్‌ను సులభతరం చేయడానికి మరియు చవకగా చేయడానికి కంపెనీ అనేక బ్యాండులతో ఒప్పందాలను కలిగివుంది. మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో కోసం సి-బుకింగ్ లు ప్రారంభమైనాయి మరియు ఆసక్తిగల కొనుగోలుదారులు డీల్సన్ వద్ద తిరిగి వాపసు తీసుకునే నామమాత్రపు మొత్తానికి రిజర్వ్ చేసుకోవచ్చు. గ్రీన్ హబ్ ఆటోమోటివ్స్ పార్ట్నర్, శ్రీకాంత్ ఎల్లూరు మాట్లాడుతూ హైదరాబాద్ డీలర్ షిప్ ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా వుందన్నారు.
మోంట్రా ఎలక్ట్రిక్ సూపర్ ఆటో షోరూమ్ ను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి




