Monday, 2 November 2026

పొద్దుతిరుగుడు పంట ప్రభుత్వం కొనేవిధంగా చూస్తా

జుక్కల్, ఎప్రిల్ 01, (జనంసాక్షి)
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని డోంగ్లి మండలంలో రైతులు పండించిన పొద్దుతిరుగుడు పంట మొత్తాన్ని ప్రభుత్వ మద్దతు ధరకు ప్రభుత్వం కొనే విదంగా చూస్తానని కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మి కాంతరావ్ రైతులకు తెలిపారు.శనివారం డొంగ్లి మండలంలో పర్యటిస్తున్న ఆయనకు యువరైతు సచిన్ పాటిల్ అధ్వర్యంలో రైతులు కలిసి పొద్దుతిరుగుడు పంట సమస్యను వివరించారు. మండలములో 3500 ఎకరాలపైనే పొద్దుతిరుగుడు పంట సాగుచేయడం జరిగిందని తెలిపారు.కానీ వ్యవసాయ అదికారులు మాత్రం కేవలం 1500ఎ కరాలలో మాత్రమే సాగుచేసినట్లు రికార్డులలో నమోదు చేశారని తెలిపారు. ప్రభుత్వ రికార్డులలో నమోదు చేసిన పంటను మాత్రమే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.ఇందుకు స్పందించిన కాంగ్రెస్ నాయకులు తోట లక్ష్మి కాంత రావ్ మాట్లాడుతు రైతులు ఆందోళన చెంద వద్దని తాను అధికారులతో మాట్లాడి పంట మొత్తం ప్రభుత్వం కొనేవిదంగా చూస్తానని తెలిపారు.ఒకవేళ ప్రభుత్వం స్పందించక పోతే ప్రభుత్వంతో పోరాడి రైతులకు న్యాయం జరిగే విదంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి జయ ప్రదీప్ , మద్నూర్ మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సాహెబ్ రావు, ఏడిగి సర్పంచ్ వినోద్ , నాయకులు, రైతులు ,గ్రామస్తులు పాల్గొన్నారు.