Tuesday, 3 November 2026

ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో అవసరం

బచ్చన్నపేట (జనం సాక్షి):
ఆరోగ్యానికి చిరుధాన్యాలు ఎంతో అవసరమని అంగన్వాడి సూపర్వైజర్ ఎల్. కవిత అన్నారు. బచ్చన్నపేట మండలంలోని కొన్నె గ్రామంలో అంగన్వాడి పాఠశాలలో నిర్వహించినటువంటి చిరుధాన్యాలు వాటి వల్ల ఉపయోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అంగన్వాడి పిల్లలకు తల్లిదండ్రులకు చిరుధాన్యాల వల్ల ఉపయోగాలు వివరిస్తూ.చిరుధాన్యాల వల్ల . థైరాయిడ్. షుగర్. గుండెపోటు లాంటి వ్యాధులను అరికట్టవచ్చని తెలిపారు. అంగన్వాడి టీచర్లు ఉషారాణి. పద్మ. విజయ. ఆయాలు. పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు