గద్వాల నడిగడ్డ, ఏప్రిల్ 17 (జనం సాక్షి);జోగులాంబ గద్వాల జిల్లాలో ఆయ పోలీస్ స్టేషన్ల పరిదిలో నమోదు అయిన కేసులలో నిందితులకు శిక్ష పడేందుకు తీసుకుంటున్న చర్యలలో భాగంగా జిల్లా ఎస్పీ కె. సృజన ఆదేశాల మేరకు డి.ఎస్పీ ఎన్.సి హెచ్ రంగ స్వామి మల్డకల్, కొదండపురం, గద్వాల్ రూరల్ , గద్వాల టౌన్, కేటి దొడ్డి, రాజోలి పోలీస్ స్టేషన్ లకు సంభందించిన 7 పోక్సో కేసులలో సోమవారము కోర్టు ట్రయల్స్ ఉన్న సందర్భంగా బాధితులకు, సాక్షులకు కోర్టు ట్రయల్స్ సమయంలో తెలియజేయాల్సిన వివరాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి బ్రీఫింగ్ చేయడం జరిగింది.అందులో బాగంగా బాధితులకు స్టేట్మెంట్ రికార్డ్ ను చదివి వినిపించడం తో పాటు ముద్దాయి ల వివరాలు గురించి తెలియజేశారు. అలాగే బాధితులను లేద సాక్షులను నిందితులు ఎవరైన ఒత్తిడికి గురి చేస్తున్నారా, ప్రలోబాలకు గురి చేస్తున్నారా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులు లేదా సాక్షులను ఎవరైనా నిందితులు ఒత్తిడికి, ప్రలోబాలకు గురి చేస్తే పోలీస్ ల దృష్టి తీసుకురావాలని తెలియజేసారు. సాక్షులు ఎవరూ కుడా ఎలాంటి ఆందోళన చెందకుండా మేజిస్ట్రేట్ ముందు జరిగిన విషయాలను, చూసిన విషయాలను తెలియ
జేయాలని డి. ఎస్పీ వారికి వివారించారు.ఈ కార్యక్రమంలో మల్డకల్, కె.టి దొడ్డి, కోదండ పూర్ ఎస్సై లు ఆర్.శేఖర్,వెంకటేష్,
వెంకట స్వామి,కోర్టు లైసన్ అధికారి ఎస్సై రషీద్,కోర్టు డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.




