పెనుబల్లి, జూన్ 13(జనం సాక్షి)గ్రామ సబల్లో సర్వే చేసిన తర్వాత ఆమోదించిన తీర్మానం ప్రాకారం ప్రతి గిరిజ నుడికి పోడు పట్టాలు ఇవ్వాల ని డిమాండ్ చేస్తూ మంగళవారంసిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెనుబల్లి తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిం చి, వినతి పత్రం సమర్పించారు,అనేక సంవత్సరాల నుంచి పేద గిరిజనులు సాగు చేసుకున్న పోడుకి, సాగుదారులకు, పట్టాలు ఇవ్వాలని, గ్రామసభల్లో సర్వే చేసిన తర్వాత ఆమోదించిన తీర్మానం ప్రకారం ప్రతి గిరిజనుడికి పోడు సాగుదారు పట్టా ఇవ్వాల్సి ఉండగా, పార్థసారథి పురంలో 19 మంది పేర్లు, కొత్త లంకపల్లి గొల్లగూడెంలో 16 పేర్లు, బ్రహ్మాలకుంటలో 17 మంది పేర్లు, లేకుండా చేశారని, వినతి పత్రం లొ పేర్కోన్నారు, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చలమాల విఠల్రావు , జాజిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ, పేదలు అనేక సంవత్సరాల నుంచి సాగు చేసుకుంటున్నారని,వారికి అందరికీ పట్టాలు అందించాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని వారు అన్నారు, తెలంగాణ ఉత్సవాల నిర్వహించుకుంటూ పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేద గిరిజనులకు అన్యాయం జరిగితే చూస్తూ సహించేది లేదని వారు ప్రభుత్వాన్ని హెచ్చరిక చేశారు, ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గాయం తిరుపతిరావు, మండల కమిటీ సభ్యులు మిట్టపల్లి నాగమణి, కంటే సత్యం, సింగ్శాల ప్రసాద్, కుంజా రాములు, కలకోట అప్పారావు, రాజులు, పద్మం వెంకటేశ్వరరావు, పోతిని సత్యనారాయణ, కుమారు , సున్నంనాగేశ్వరావు, సున్న శివ, విశ్వనాథం, తదితరులు పాల్గొన్నారు,.
పోడుసాగు చేస్తున్న ప్రతి గిరిజ న పేదరైతుకు పట్టాఇవ్వాలి




