అలంపూర్ జూన్13(జనంసాక్షి)ఆడబిడ్డల అభివృద్ధికి కెసిఆర్ పెద్దపీట వేస్తూ మహిళా సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం లో ఉంది అని ఎమ్మెల్యే అబ్రహం అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా అలంపూర్ చౌరస్తా లోని ఏ జి ఆర్ ఫంక్షన్ హాల్లో మంగళవారం జరిగిన తెలంగాణ మహిళ మహిళా సంక్షేమ దినోత్సవం కార్యక్రమంలో అలంపూర్ శాసన సభ్యులు డాక్టర్.వి.యం.అబ్రహం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, ఆడబిడ్డలను పైకి తీసుకురావాలన్న తపనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ, దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఏ రాష్ట్రంలో చేయనన్ని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. తెలంగాణ ఉత్సవాల్లో భాగంగా జరుపుకుంటున్న మహిళా సంక్షేమ దినోత్సవం సందర్భంగా మహిళాలోకానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.
కళ్యాణ లక్ష్మితో ఇంటి పెద్దలా, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ తో ఇంటి డాక్టర్ లా, కేసీఆర్ కిట్ తో మేనమామలా, అమ్మఒడి తో సంరక్షకుడిలా,ఆరోగ్య లక్ష్మి తో ఆరోగ్య దాతగా, షీ టీంలతో రక్షకుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారని పేర్కొన్నారు. బీడీ కార్మికులకు పెన్షన్ తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని తెలిపారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలు భాగస్వామ్యం చేసిన ఘనత కేసిఆర్ కు దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటికోసం కిలోమీటర్ల దూరం నడవకుండా,ఇంటికే సురక్షిత నీరు అందించాలన్న ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంగన్ వాడి, ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడని చెప్పారు.మహిళా సంక్షేమానికి విప్లవాత్మక పథకాలతో దేశానికి స్ఫూర్తి.ఆడబిడ్డలకు అన్నీ తానై అండగా నిలుస్తున్న కేసీఆర్ సర్కార్ అండగా ఉంటూది అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు మరియు బిఆర్ ఎస్ పార్టీ నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
మహిళ సంక్షేమంలో తెలంగాణ అగ్రస్థానం. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం




