పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు పోరాటం చేస్తా
గంగారం డిసెంబర్ 10 (జనం సాక్షి)
గడిచిన 8 ఏళ్ల కెసిఆర్ పాలనలో మండలంలో ఒక్క డబుల్ బెడ్ రూం ఇవ్వని పరిస్థితి
పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది నన్ను ఆదరించిన అభిమానించిన ప్రజల రుణం తీర్చుకోలేది
దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క మండలం లోని
గంగారాం మండలం లోని దుబ్బగుడెం, మామిడి గూడెం, తాళ్ళ గుంపు గ్రామాలలో 650 కుటుంబాలకు దుప్పట్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోడు భూములకు సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం తో పోరాటం చేస్తున్నాం అని పోడు భూములకు పట్టాలు ఇచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది నన్ను ఆదరించి అక్కున చేర్చుకున్న ప్రజలకు మరింత సేవ చేస్తానని చలి తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సీతక్క అన్నారు
అనంతరం తాళ్ళ గుంపు కు చెందిన 40 కుటుంబాలు వివిధ పార్టీలకు చెందిన నాయకులు కాంగ్రెస్ పార్టీ లో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఈసం రమ సురేష్,ఎంపీపీ సువర్ణ పాక సరోజన వైస్ ఎంపీపీ ముడిగే వీరభద్ర పార్టీ సీనియర్ నాయకులు ముడిగే భద్రయ్య, మాజీ మండల అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు సుధాకర్, సురేష్, సుమన్, జాడి వెంకటేశ్వర్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పా
ల్గొన్నారు




