Wednesday, 4 November 2026

డీఎస్పీకి వినతి పత్రం అందజేసిన బీఎస్పీ నాయకులు

*డీఎస్పీకి వినతి పత్రం అందజేసిన బీఎస్పీ నాయకులు*
మెట్పల్లి టౌన్, డిసెంబర్ 10,
జనం సాక్షి:
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో బీఎస్పీ నాయకుని పై దాడి చేసిన నిందితుల పై పీడీ యాక్ట్ ,రౌడీషీట్ కేసులు ఓపెన్ చేయాలి అని మెట్పల్లి డి.ఎస్.పి రవీందర్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు
ఈ సందర్భంగా బీఎస్పీ జిల్లా ఇన్చార్జి మద్దెల నారాయణ మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండల బీఎస్పీ నాయకుడు బహుజన వాది బొబ్బిలి గోపి పై కొందరు టిఆర్ఎస్ నాయకులు బట్టు శేఖర్ బత్తుల నరేష్ భరత్ విపుల్ మరియు వారి అనుచరులు దాదాపు 30 మంది తాగి దాడి చేసిన వారిపై పీడి యాక్ట్ రౌడీషీట్ కేసులు ఓపెన్ చేయాలని మెట్పల్లి డిఎస్పి రవీందర్ రెడ్డి కి వినతిపత్రం అందజేయడం జరిగింది.
పై నిందితులు నియోజకవర్గంలో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని భూములు కబ్జా చేస్తున్నారని వెంటనే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు శాసనసభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వారిని టిఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు, లేనియెడల బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పుప్పాల లింబాద్రి ,జిల్లా నాయకులు బత్తుల లక్ష్మణ్, గుజ్జరి ప్రకాష్, కోల రాములు, గోరు మంతుల ప్రభాకర్, సంపత్, రాథోడ్, నరేష్, కిషోర్ , శేఖర్,శ్రీధర్ నవీన్, ప్రవీణ్, లక్ష్మీనరసయ్య, నరేష్, సురేష్ ,నిజామాబాద్ జిల్లా బీఎస్పీ నాయకులు ఇత్వార్ పేట్ లింగన్న, రాజన్న, నవీన్, బివిఎం రాష్ట్ర అధ్యక్షులు బట్టు శ్రీధర్ లతోపాటు వందలాదిమంది నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.