Thursday, 5 November 2026

పోడు భూములకు హక్కు పత్రాలు వెంటనే పంపిణీ చేయాలి 

 

 

 

 

 

 

 

రఘునాథ పాలెం ఏప్రిల్ 18(జనం సాక్షి)రాష్ట్రం వ్యాప్తంగా పోడు భూములు సర్వే నిర్వహించి హక్కు పత్రాలు పంపిణీకి సిద్ధం అని ప్రకటించిన ప్రభుత్వం పోడు రైతులకు హక్కు పత్రాలు ఎందుకు అందజేయడం లేదో ప్రభుత్వం స్పష్టం చేయాలని, ఇప్పటికైనా ప్రభుత్వం కాలయాపన చేయకుండా తక్షణమే హక్కు పత్రాలు అందించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు భూక్యా వీరభద్రం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న పోడు దరఖాస్తులను తిరిగి పరిశీలించి హక్కు పత్రాలు ఇవ్వటానికి ప్రభుత్వం సిద్ధం కావాలని రైతుల పక్షాన కోరారు. పోడు గిరిజన రైతులందరికీ గిరి వికాస్ పథకం కింద బోర్లు, విద్యుత్, సౌకర్యం కల్పించాలని, పోడు రైతులపై అడవి శాఖ అధికారులు పెట్టిన అక్రమ కేసులను వెంటనే రద్దు చేయాలని కోరారు. ఖమ్మం జిల్లా ఐదు లక్షల మంది జనాభా కలిగిన గిరిజనుల. సంక్షేమం, విద్య, అభివృద్ధి కొరకు వెంటనే ఖమ్మంలో ఐటీడీఏ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కోరారు. గిరిజన, పేదలు నివాసం ఉంటున్న గుడిసెల స్థానంలో ఇళ్ల నిర్మాణ పథకం కింద ఐదు లక్షల రూపాయలు విడుదల చేయాలని ఆయన కోరారు.