Thursday, 5 November 2026

సమ్మెకు దిగిన వి ఒ ఎ లుసంఘీభావం తెలిపిన సిపిఎం.

 

 

 

 

బూర్గుంపహాడ్ ఏప్రిల్ 17 (జనంసాక్షి)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం ఐకేపీలో పనిచేసే విఓఏ ల సంఘం సోమవారం మండలకేంద్రంలో తహసిల్దార్ కార్యాలయం ముందు తమ న్యాయమైన కోరికలు తీర్చాలని నిరవదిక సమ్మె చేపట్టామని వివోఏ ల సంఘం తెలిపారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ 2023 ఏప్రిల్ 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టామని, ఐకేపీ వీవోఏల యూనియన్ డిమాండ్లను పరిష్కరించే వరకూ సమ్మె కొనసాగుతుందని వివోఎ ల సంఘం స్పష్టం చేశారు. వీవోఏ లకు 26,000 వేల గౌరవ వేతనం, పీఆర్సి అమలు చేయాలని, వీవోఏలను సెర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని, ప్రమాద భీమా 20 లక్షలు చెల్లించాలని, ఆరోగ్య భీమా 10 లక్షలు కల్పించాలని, అర్హులైన విఒఏ లను సిసిలుగా ప్రమోషన్ కల్పించాలి. వీవోఏలకు గుర్తింపు కార్డులు ఇవ్వాలనే డిమాండ్లపై సమ్మెకు దిగినట్లు వివరించారు. విఒఎ ల సమ్మెకు సిపిఎం మండల కార్యదర్శి బత్తుల వెంకటేశ్వర్లు, రాయల వెంకటేశ్వర్లు సంఘీభావం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని ఐకెపి విఒఎ ల సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.