ఈ నెల 25 వాయిదాపడ్డ వీక్లీ మార్కెట్ వేలం పాట.
కోటగిరి మార్చి 21 జనం సాక్షి:-పోతంగల్ మండల కేంద్రంలోని స్థానిక గ్రామపంచాయతీ కార్యాలయంలో శనివారం సర్పంచ్ వర్ని శంకర్ అధ్యక్షతన గ్రామ కార్యదర్శి డబ్ల్యూ యాదవ్ నేతృత్వంలో మూడు రోజుల క్రితం వాయిదాపడ్డ మేకల సంత,వీక్లీ మార్కె ట్ లకు వేలం పాట మంగళవారం తిరిగి నిర్వహించా రు.మొదటగా మేకల సంతకు వేలం పాట నిర్వహించగా ఈ వేలం పాటను గంధపు గంగారాం రూ.5 లక్షలకు దక్కించుకోన్నారు.అనంతరం వీక్లీ మార్కెట్ వేలం పాటలో ఆశావాహుల నుండి ఆశించిన స్పందన రాకపోవడంతో ఈ వేలం పాటను ఈ నెల 25 కు వాయిదా వేశారు.ఈ వేలం పాట కేవలం12 నెలల కాల వ్యవధికి మాత్రమేనని గ్రామ కార్యదర్శి డబ్ల్యూ యాదవ్ తెలిపారు.ఏది ఏమైన ప్పటి కీ గ్రామ పంచాయతీకి మాత్రం గతంలో కన్న ఈ సారి జరిగిన మేకల సంత వేలం పాట అధిక ఆదాయాన్ని పెంచిందని స్థానికులు అభిప్రాయ పడ్డారు.ఈ వేలం పాటలో ఎంపిటిసి కేశ వీరేశం,ఉప సర్పంచ్ వినోద్, జూనియర్ అసిస్టెంట్ సందీప్, కారోబార్ నాగేష్,గ్రామ పెద్దలు,యువకులు, తదితరులు పాల్గొన్నారు.




