ఫొటో : సన్మానం చేస్తున్న సర్పంచ్, పాలకవర్గం సభ్యులు.
నెన్నెల, మార్చ్ 21, (జనంసాక్షి )
నెన్నెల మండలం గొల్లపల్లి పంచాయతీ మద్దివేణి రంజిత్ ను మంగళవారం సర్పంచ్ ఇందూరి శశికళ, పాలకవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. గొల్లపల్లి గ్రామపంచాయతీ జాతీయ స్థాయిలో ఉత్తమ గ్రామపంచాయతీ గా నామినేట్ అయ్యేందుకు కృషి చేసినందున గ్రామపంచాయతీ తరుపున సర్పంచ్, పాలక వర్గం సన్మానించి, శాలువాతో సత్కారించారు. అనంతరం గ్రామ సభ నిర్వహించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈకార్యక్రమంలో ఉప సర్పంచ్ జాడి నారాయణ, వార్డు సభ్యులు గంగమల్లు, ఉమాదేవి, శ్రీనివాస్, ప్రమోద్, మాజీ సింగల్ విండో చైర్మన్ ఇందూరి రమేష్, అంగన్వాడీ కార్యకర్తలు రాజమణి, సుజాత గ్రామస్తులు పాల్గొన్నారు.
పంచాయతీ కార్యదర్శికి సన్మానం.




