Wednesday, 4 November 2026

పోరాట యోధురాలు కామ్రేడ్ బేబక్క

పోరాట యోధురాలు కామ్రేడ్ బేబక్కకేఎంసికి కామ్రేడ్ బేబక్క పార్థివ దేహంవివిధ పార్టీ నాయకుల ఘన నివాళులుకొత్తగూడ మార్చి 25 జనంసాక్షి:ప్రజాసేవలో నిమగ్నమై ఎన్నో అలుపెరగని పోరాటం చేసి నిరంతరం ప్రజలకు అండగా ఉండి ఎన్నో పోడు భూములను పంచిపెట్టిన ఘనత బేబక్కకు దక్కుతుంది.కామ్రేడ్ నిమ్మగడ్డ సరోజన అలియాస్ బేబక్క అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం రోజున స్వగ్రామైన మహబూబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండంపల్లి గ్రామంలో తుది శ్వాస విడిచారు.బేబక్క చివరి కోరిక మేరకు కుటుంబ సభ్యులు పార్థివ దేహాన్ని  కాకతీయ మెడికల్ కాలేజ్ కు ఇవ్వడం జరుగుతుంది.కామ్రేడ్ బేబక్క అంతిమయాత్ర సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ కొత్తగూడ గూడూరు గంగారం మండలాల సబ్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో కొత్తగూడ సెంటర్లో భారీ ర్యాలీ నిర్వహించి కొత్తగూడ పార్టీ కార్యాలయం ముందు నిర్వహించిన సంతాప సభలో బేబక్కకు అంతిమ వీడ్కోలు పలికారు.మహబూబాద్ జిల్లా నాయకులు కామ్రేడ్ బూర్కా వెంకటన్న నర్సక్కలు మాట్లాడుతూ కామ్రేడ్ బేబక్క కుటుంబానికి సంతాప సానుభూతిని తెలియజేస్తూ వినమ్రంగ విప్లవ జోహార్లు అర్పించారు.కామ్రేడ్ బేబక్క తన చిన్న వయసు నుండి విప్లవోద్యమంలో పనిచేస్తూ అంచలంచలుగా ఎదుగుతూ సిపిఎంఎల్ జోనల్ నాయకురాలుగా రైతు కూలి సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది.ఏజెన్సీ ఆదివాసి గిరిజన ప్రాంతంలో పనిచేసి ఆదివాసి గిరిజన బడుగు బలహీన పేద వర్గాల కోసం నిస్వార్ధంగా విప్లవ ప్రతిఘటన ఉద్యమంలో ఉద్యమించారు.ఎమర్జెన్సీ చీకటి రోజుల్లో అనేక నిర్బంధాలను ఎదుర్కొని దోపిడీ పాలకవర్గ పార్టీలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేస్తూ ఆదివాసి గూడాలను గుంపులను తిరుగుతూ వారికి బాసటగా నిలిచారు.కామ్రేడ్ బేబక్క తమ్ముడైన కామ్రేడ్ పాలడుగు కృష్ణ పేద ప్రజల కోసం పోరాడి 1979 నవంబర్ 7న పాకాల కొత్తగూడలో హత్యకు గురైన కూడా ఇసుమంతైనా చెల్లించకుండా గుండె నిబ్బరంతో విప్లవోద్యమంలో నడిచారు.కామ్రేడ్ బేబక్క పాలడు కృష్ణన్న నాయకత్వంలో కొత్తగూడ గంగారం నర్సంపేట ఏరియా ప్రాంతాలలో అనేక పోడు భూములను కొట్టించి ఫారెస్ట్ దాడులను ఎదుర్కొని పేద ప్రజలకు భూములను పంచిన చరిత్ర కామ్రేడ్ బేబక్కది.అంతేకాకుండా పాకాల కొత్తగూడ ఏరియా ప్రాంతంలో పనిచేస్తున్న అజ్ఞాత దళాలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ తను తుది శ్వాస వరకు నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన కామ్రేడ్ బేబక్క మరణం విప్లవ ప్రతిఘటన ఉద్యమానికి తీరని లోటు అని వారు స్పష్టం చేశారు.ఈ యొక్క సంతాప సభ ర్యాలీ లో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిపిఐ ఎంఎల్ ప్రజా పందా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ సిపిఐ ఎంఎల్ తుడుం దెబ్బ ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగమల్లేశ్వరరావు హాజరై బేబక్క పార్థివ దేహం పై పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ యొక్క అంతిమయాత్ర ర్యాలీ సంతాప సభలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నాయకులు శ్రీశైలం  శివారపు శ్రీధర్ గట్టి సురేందర్ బూర్కా బుచ్చి రాములు రాస మల్ల శ్రీను గజ్జి సోమన్న పసునూరి రాజమల్లు యాదగిరి యుగంధర్ పోతుగంటి వెంకన్న లక్ష్మయ్య పిట్టల దేవేందర్ సరోజన రమ ఇరుప ముత్తయ్య నారాయణరెడ్డి సిపిఐ ఎంఎల్ ప్రజా పందా నాయకులు గుమ్మడి నరసయ్య రాయల చంద్రశేఖర్ చిన్న చంద్రన్న కొత్తపల్లి రవి పూనం ప్రభాకర్ రాయల విమల అరుణ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు ఆవు నూరి మధు పుల్లన్న మండల వెంకన్న బండారి ఐలన్న తిరుపతమ్మ సిపిఐ ఎంఎల్ నాయకులు మోడం మల్లేష్ ఈర్ల పైడి తుడుం దెబ్బ నాయకులు ఆకబోయిన రవి ఆలూరి రాజు ఎమ్మార్పీఎస్ నాయకులు తీగల ప్రేమ్ సాగర్ కేదాసి ప్రసాద్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య టిఆర్ఎస్ పార్టీ నాయకులు నాగమల్లేశ్వరరావు నెహ్రు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.