కేంద్రం ఇబ్బందులు పెడుతుంది
పోలవరం ప్రాజెక్ట్ రాయలసీమకు వరం
కడపలో స్టీల్‌ప్లాంట్‌కోసం దీక్ష చేస్తా
ఉనికి కోసమే కన్నా విమర్శలు
విలేకరుల సమావేశంలో ఎంపీ సీఎం రమేష్
న్యూఢిల్లీ, జూన్13(జనం సాక్షి) : పోలవరం నిర్మాణానికి ప్రతి పైసా కేంద్రం నుంచి వచ్చిందేనని కన్నా చెబుతున్నారని అది అవాస్తవమని టీడీపీ ఎంపీ సీఎం రమేష్ అన్నారు. బుధవారం ఢిల్లీలో ఆయన విూడియాతో మాట్లాడుతూ పార్టీ ఉనికి కోసమే కన్నా విమర్శలు చేస్తున్నారని అన్నారు. పోలవరం నిర్మాణానికి రాష్ట్రం ప్రభుత్వం ఖర్చు చేసిన దానికి ఇంతవరకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని రమేష్ విమర్శించారు. పోలవరం ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధపెట్టారని రమేష్ పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్ట్ రాయలసీమకు వరమని, పోలవరానికి రాష్ట్రం ప్రభుత్వం పెట్టిన ఖర్చును కేంద్రం వెంటనే ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. కడప స్టీల్‌ప్లాంట్ కోసం దీక్ష చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. కడపలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై త్వరలో ప్రధాని మోదీని కలుస్తామన్నారు. ఏపీకి ప్రత్యేక ¬దా కోసం తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీల రాజీనామాలతో ఉపయోగం లేదన్నారు. ఏపీకి మేలు చేయాలనే ఉద్దేశం కేంద్రానికి లేదని రమేష్ విమర్శించారు. ఆంధప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని సీఎం రమేశ్ అన్నారు. వైకాపా, భాజపా కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతున్నాయని ఆరోపించారు. విభజన హావిూలన్నింటిని నెరవేరిస్తేనే భాజపా నేతలకు కనీస గౌరవం దక్కుతుందన్నారు. లేకుంటే రాబోయే రోజుల్లో బీజేపీ నేతలను వారికి సహకరించే వైసీపీ నేతలను ప్రజలు తరిమికొడతారని హెచ్చరించారు.
పోలవరంకు నిధులివ్వకుండా..




