నిర్మాణ బాధ్యత కేంద్రానికే అప్పగిస్తే బాగుంటుంది
వైఎస్ జగన్ పాదయాత్రకు విశేష మద్దతు లభిస్తోంది
ప్రతిపక్షనేతగా జగన్ బాగానే పని చేస్తున్నారు:
పోలవరం, పులిచింతం ప్రాజెక్ట్‌ల పనుల్లో పురోగతి వైఎస్సాఆర్ చలవే
మోదీ వ్యక్తిగత, కుటుంబపరమైన ప్రలోభాలకు అతీతుడు
జీఎస్టీ, డీమానిటైజేషన్ సాహసోపేతమైన నిర్ణయాలు
విలేకరుల సమావేశంలో మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వరరావు
హైదరాబాద్, జూన్20(జనం సాక్షి ) : పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం పరిధిలోనిదని, ఆ ప్రాజెక్ట్ నిర్మాణ బాధ్యతలు రాష్ట్రం కాకుండా కేంద్రానికే అప్పగిస్తే బాగుటుందని మాజీ మంత్రి దగ్గుపాటి వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం విూడియాతో మాట్లాడారు. తెలంగాణలో ఓట్ల కోసం ఆనాటి ఏపీ నేతలు పులిచింతల, పోలవరం ప్రాజెక్టులపై మాట్లడలేదని దగ్గుబాటి అన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టు పనుల్లో పురోగతి సాధించారన్నారు. దేవగౌడ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్ట్‌కు అనుమతులు ఇచ్చేందుకు సానుకూలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో ఓట్లు పోతాయనే భయంతో ఆనాటి నేతలు తిరస్కరించాని అన్నారు. ఆంధప్రదేశ్‌కు ఎంతో కీలకమైన పోలవరం ప్రాజెక్ట్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని, ప్రజాధనం వృథా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ రాష్ట్రానికి వరమని అన్న దగ్గుపాటి.. జాతీయ ప్రాజెక్ట్‌ను రాష్ట్రం చేపట్టాల్సిన అవసరమేంటని ఆయన ప్రశ్నించారు. పట్టిసీమ వల్లే నేడు కృష్ణా డెల్టా బతికిందన్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే పోలవరం సాధ్యమయ్యేది కాదని అన్నారు. ముంపు మండలాలను ఏపీలో కలపకపోతే సీఎంగా ప్రమాణం చెయ్యబోనన్న చంద్రబాబు మాట నమ్మనని దగ్గుబాటి వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిగత, కుటుంబపరమైన ప్రలోభాలకు అతీతుడని అభివర్ణించారు. గూడ్స్ సర్వీస్ టాక్స్(జీఎస్టీ) సాహసోపేత సంస్కరణగా పేర్కొన్నారు. రాజకీయ కారణాలు, ఇతర అంశాల వల్ల జీఎస్టీ విమర్శల పాలవుతోందని పేర్కొన్నారు. డీమానిటైజేషన్ కూడా గొప్ప నిర్ణయమే కానీ ఇన్‌కంటాక్స్ అధికారులు సరైన విధంగా నడిపించకపోవడంతో ప్రజలనుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చిందని వివరించారు. ప్రతిపక్షనేతగా జగన్ బాగానే పని చేస్తున్నారని మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు అన్నారు. పాదయాత్రతో వైసీపీ నిలదొక్కుకుందని తెలిపారు. ఎన్నికల్లో తాను ఎప్పుడూ డబ్బు పంచలేదన్నారు. పదవీకాలం ముగిసే వరకు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి అవసరాలను తీర్చానని దగ్గుబాటి వివరించారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అలా లేవని నియోజకవర్గానికి ఒక్కో అభ్యర్థి కనీసం 20 కోట్లు ఖర్చు చేస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో డబ్బు తీసుకున్నా ఓటర్లు తమ మనోభావాలకు అనుగుణంగానే ఓట్లు వేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. 1983కు ముందు ఇటువంటి రాజకీయ వాతావరణం లేదని, క్రమంగా పెరిగిందన్నారు. అందుకే ఇలాంటి రాజకీయాలకు దూరంగా ఉన్నానని, రాజకీయాలను ఎవరూ శాశ్వతంగా శాసించలేరని పునరుద్ఘాటించారు. ఆంధప్రదేశ్‌లో అధికార పార్టీ చేస్తున్న మోసాలను, తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతోందని ప్రశంసించారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్ పాదయాత్రకు ప్రజల నుంచి విశేష మద్దతు లభిస్తోందని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్ కేంద్రం పరిధిలోనిది




