Tuesday, 3 November 2026

పోలీసులను అభినందించిన గవర్నర్

narasimhan_1072118eవిధి నిర్వహణలో ఎదురయ్యే సవాళ్లను పోలీసులు దీటుగా ఎదుర్కోవాలని గవర్నర్‌ నరసింహన్‌ సూచించారు. కానిస్టేబుళ్ల ప్రవర్తన ద్వారా పోలీసుల పనితీరు ప్రజలకు అర్థమవుతుందన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ పోలీసుల పనితీరును గవర్నర్‌ అభినందించారు.తెలంగాణ పోలీస్‌ శిక్షణ సంస్థలో రూ.21కోట్ల వ్యయంతో నిర్మించనున్న అత్యాధునిక పోలీస్‌స్టేషన్‌, తరగతి గదులు, క్రీడా ప్రాంగణానికి గవర్నర్‌ నరసింహన్‌ భూమిపూజ, శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ.. ప్రజామిత్ర పోలీసింగ్‌ ద్వారా అనేక మార్పులొచ్చాయన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు ప్రత్యేకమైన గుర్తింపు లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *