Wednesday, 4 November 2026

పోలీసులా? వీధి రౌడీలా?

యూపీ పోలీసులు మరోసారి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన దళిత దంపతులపట్ల అమానుషంగా వ్యవహరించారు. కంప్లైంట్ తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులను నిలదీసినందుకు.. వారిని ఘోరంగా అవమానించారు. మాకే ఎదురు చెబుతారా అంటూ ఇష్టమొచ్చినట్లు కొట్టారు. మహిళ అని కూడా చూడకుండా నడిరోడ్డుపైకి ఈడ్చుకొచ్చి బాధితురాలి బట్టలూడదీశారు. ఆమె భర్త ఒంటిపై బట్టలను కూడా చించేశారు. అడ్డకున్న బంధువులపై కూడా దాడికి పాల్పడ్డారు. పైగా బాధితులపైనే దాడి కేసు నమోదు చేసి జైలుకు పంపటం ద్వారా తమ రాక్షసత్వాన్ని నిరూపించుకున్నారు. పోలీసులు అకృత్యాన్ని చాటుగా వీడియో తీసిన ఓ వ్యక్తి.. దాన్ని యూట్యూట్ లో పెట్టడంతో విషయం వెలుగుచూసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *