Thursday, 5 November 2026

పోలీసులు మీకోసం భాగంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్లను అందజేసిన జమ్మికుంట రూరల్ సిఐ సురేష్ ఎస్ఐ శేఖర్ రెడ్డి.

 

 

 

 

 

 

 

వీణవంక మే 16 (జనం సాక్షి )వీణవంక మండలంలోని ఎల్బాక గ్రామంలో పోలీసులు మీకోసం భాగంలో క్రీడాకారులకు జమ్మికుంట రూరల్ సీఐ సురేష్ స్థానిక ఎస్సై శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని మంగళవారం అందజేశారు క్రీడల వలన యువతకు శారీరక దృఢత్వాన్ని పెంచడమే కాకుండా ఆహ్లాదాన్ని కలిగిస్తాయని యువతకు పోటీ తత్వాన్ని పెంచుతాయని వారన్నారు అనంతరం పిల్లలు వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు జమ్మికుంట రూరల్ సీఐ సురేష్. ఎస్ఐ శేఖర్ రెడ్డి తెలియజేశారు. చిన్నపిల్లలు గ్రామాలలో కుంటలు బావులు చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లవద్దని పిల్లలు ఈత నేర్చుకునేటప్పుడు నిపుణుల సమక్షంలో ఈత నేర్చుకోవాలని తల్లిదండ్రులు పిల్లల విషయంలో పలు జాగ్రత్తలు వహించాలని సూచించడం జరిగింది. తల్లిదండ్రులు మైనర్ పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు మైనర్లు డ్రైవింగ్ చేయడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రమాదాలను నివారించడానికి పలు జాగ్రత్తలు తీసుకోవాలని వారన్నారు. పిల్లలు మొబైల్ ఫోన్లు వాడేటప్పుడు తల్లితండ్రులు దృష్టి సారించాలని సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించడం జరిగింది పిల్లలు చెడు వ్యసనాలకు మారక ద్రవ్యాలు. మద్యం గాని గంజాయి అలవాటు పడే అవకాశం ఉందని పిల్లల పట్ల తల్లిదండ్రులు దృష్టి సారించాలని అన్నారు. ఎటువంటి అనుమానం ఉన్న 100 కు కాల్ చేసి పోలీసులకు తెలపాలని సూచించడం జరిగింది మార్కులు ఎప్పుడు ప్రామాణికం కాదు తక్కువ వస్తే పిల్లలు బాధపడవద్దని సక్సెస్ కావాల్సింది జీవితంలో పరీక్షలలో కాదు ఆధైర్య పడద్దని సూచించడం జరిగింది మహిళ ఆడపిల్లలకు సంబంధించిన చట్టాలు కఠిన తరం అయినందున వారి విషయంలో ఎటువంటి ఇబ్బందులకు గురి కావద్దని చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల ఎంపీటీసీలో పోరం అధ్యక్షుడు కాసం వీరారెడ్డి. ఎంపీటీసీ నాగిడి సంజీవరెడ్డి. నరహరి తిరుపతిరెడ్డి. తో పాటు యువత పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు