Thursday, 5 November 2026

బాధిత కుటుంబానికి బియ్యం అందజేత

 

 

 

 

 

 

 

జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని కూచ్ రాజ్ పల్లి కి చెందిన దూడపాక మల్లయ్య ఇటీవల మృతి చెందగా మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బాధిత కుటుంబానికి 50 కిలోల బియ్యం బస్తాను మంగళవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటారి రాజు, మంథని మున్సిపల్ ఎస్సీ సెల్ అధ్యక్షులు నాగెల్లి జాని,యూత్ కాంగ్రెస్ నాయకులు కేక్కర్ల సందీప్ ,పెరుగు సతీష్ తదితరులు పాల్గొన్నారు.