పోలీసుల అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం
– బిజెపి పట్టణ అధ్యక్షులు మహాకాళి శ్రీనివాస్
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు, నిన్న హైదరాబాద్ లో బిజెపి కార్యకర్తలపై టిఆర్ఎస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ మంగళవారం రామకృష్ణాపూర్ లోని సూపర్ బజార్ సెంటర్లో దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందనీ బిజెపి పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్ అన్నారు.
ఈ దీక్ష కార్యక్రమం చేయకుండా అడ్డుపడి బిజెపి నాయకులను అరెస్టు చేయడం శోచనీయమని అన్నారు.
పట్టణ పోలీసులు అరెస్టు చేసిన వారిలో బిజెపి పట్టణ అధ్యక్షులు మహంకాళి శ్రీనివాస్, సీనియర్ నాయకులు ఆరు ముళ్ళ పోషం, బిజెపి పట్టణ ప్రధాన కార్యదర్శులు మాస్ సత్యనారాయణ, వేల్పుల సత్యనారాయణ, బీసీ మోర్చా అధ్యక్షులు వీరమల్ల పాలరాజయ్య, బీజేవైఎం పట్టణ కార్యదర్శి ఓరుగంటి సాయి, రమేష్ , సందీప్, అరిగల రవీందర్, వైద్య శ్రీనివాస్, బంగారు ప్రసాద్ లు ఉన్నారు.