Monday, 2 November 2026

పోలీసుల అదుపులో కాల్పుల ఘటన నిందితుడు

హైదరాబాద్‌: హైదరాబాద్‌ పాతబస్తీలో కాల్పుల ఘటన నిందితుడ్ని ఎట్టకేలకు ఫలక్‌నుమా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆగస్టు 22న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పాతబస్తీలో వివివాహ వేడుక సందర్భంగా నిర్వహించిన బరాత్‌లో గుర్రంపై వూరేగుతున్న వరుడు అత్యుత్సాహంతో గాల్లోకి కాల్పులు జరిపాడు. ఓకే సారి రెండు రివాల్వర్లతో ఆరు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. ఆగస్టు 22న రాత్రి 10 గంటలకు ఘటన జరిగితే ఇప్పటి వరకూ పోలీసులు స్పందించలేదు. కాల్పుల ఘటన జరగలేదని, వదంతులు నమ్మ వద్దని తొలుత దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ తెలిపారు. కాల్పుల దృశ్యాలు ఆదివారం ఉదయం వెలుగులోకి రావడంతో ఎట్టకేలకు స్పందించిన అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. ఫలక్‌నుమా ఏసీపీ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టాయి. పాతబస్తీలోని షామా థియేటర్‌ ఎదుట కాల్పుల ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *